క్రీడాభూమి

టాప్‌లోనే కోహ్లీ, బుమ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, మార్చి 17: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ టాప్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వనే్డ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. స్వదేశంలో జరిగిన వనే్డ సిరీస్‌లో కోహ్లీ 310 పరుగులు సాధించి మొదటి స్థానంలో ఉండగా, 202 పరుగులు సాధించిన రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్ల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నా డు. కేదార్ జాదవ్ 11 స్థానాలను మెరుగుపరుచుకొని తన కెరీర్ బెస్ట్ 24వ ర్యాంకు సాధించగా, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వాంటన్ డీకాక్ ఇటీవల శ్రీలం కతో జరిగిన వనే్డ సిరీస్‌లో 353 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో 774 పాయంట్లతో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్‌లో ఉండగా, న్యూ జిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండు, అఫ్గానిస్తా న్ స్పిన్న ర్ రషీద్ ఖాన్ మూడు, దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రా న్ తాహీ ర్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితా లో మొదటి ఐదు స్థానాల్లో భారత్‌కు చోటు దక్కలేదు. వనే్డ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్, భారత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో న్యూ జిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ ఐదో స్థానానికి పరిమితమైంది.

చిత్రం.. కోహ్లీ, బుమ్రా