క్రీడాభూమి

అఫ్గాన్ అద్భుతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: అఫ్గానిస్థాన్ జట్టు అద్భుతం సృష్టించింది. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టెస్టుల్లో మొదటి విజయాన్ని అందుకుంది. దీంతో ఆడిన రెండో టెస్టులోనే విజయం సాధించిన జట్టుగా ఇంగ్లాండ్, పాకిస్థాన్‌తో సంయుక్తంగా నిలిచింది. అంతకుముందు ఐర్లాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన అప్గాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మహమ్మద్ షాజాద్ (2) అండీ మెక్‌బ్రైన్ అవుట్ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రహమత్ షా సహకారంతో మరో ఓపెనర్ ఇసానుల్లా జానత్ నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మరో 6 పరుగులు చేస్తే విజయం ఖాయం అనుకున్న సమయంలో రహమత్ షా (76) జేమ్స్ కామెరూన్ బౌలింగ్‌లో స్టాంపౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ నబి (1) కూడా వెంటనే రనౌట్‌గా పెవిలియన్ చేరడంతో మిగతా లాంఛనాన్ని హష్మతుల్లా షాహిదీ (4, నాటౌట్) సహకారంతో ఇసానుల్లా జానత్ (65, నాటౌట్) పూర్తిచేశాడు. దీంతో ఏకైక టెస్టులో ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్ బౌలర్లలో అండీ మెక్‌బ్రైన్, జేమ్స్ కామెరూన్ బౌకు చెరో వికెట్ లభించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు విజయాన్నందిచిన రహమత్ షాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
అప్పుడు తప్పని ఓటమి..
క్రికెట్ ప్రపంచంలోకి పసికూనగా వచ్చిన అఫ్గానిస్థాన్ ఇప్పటివరకు ఎన్నో అద్భుతా లు సృష్టించింది. తొమ్మిది నెలల క్రితం భారత్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఓడినా, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం జట్టు మొత్తం సమష్టిగా రాణించి, అంతర్జాతీయ టెస్టు మ్యాచుల్లో తన ఖాతాను ఘనంగా ప్రారంభించింది.
స్కోర్‌బోర్డు:
ఐర్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 172 (60 ఓవర్లలో ఆలౌట్)
ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్: 288 (93 ఓవర్లలో ఆలౌట్)
అఫ్గానిస్థాన్ మొదటి ఇన్నింగ్స్: 314 (ఆలౌట్)
అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్: మహమ్మద్ షాజాద్ (సీ) స్టువర్ట్ పాయంటర్ (బీ) అండీ మెక్‌బ్రైన్ 2, ఇసానుల్లా జానత్ (నాటౌట్) 65, రహమత్ షా (స్టాంప్) స్టువర్ట్ పాయంటర్ (బీ) జేమ్స్ కామెరాన్ 76, మహమ్మద్ నబీ (రనౌట్) ముర్టాగ్/స్టువర్ట్ పాయంటర్ 1, హష్మతుల్లా షాహిదీ (నాటౌట్) 4.
ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 149 (47.5 ఓవర్లలో, మూడు వికెట్ల నష్టానికి)
బౌలింగ్: జార్జ్ డాక్రెల్ 22-7-58-0, అండీ మెక్‌బ్రైన్ 13-5-35-1, జేమ్స్ కామెరాన్- డౌ 5.5-0-24-1, టిమ్ ముర్టాగ్ 5-3-15-0, స్టువార్ట్ థాంప్సన్ 1-0-9-0, అండ్రూ బల్బిమీ 1-0-8-0.

ఆయా జట్ల మొదటి టెస్టు మ్యాచ్ విజయాలు
ఆడిన ఠెండో టెస్టు మ్యాచ్‌లోనే అఫ్గాన్ ఘన విజయం సాధించింది. ఆయా జట్లకు సంబంధించి మొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ విజయాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఆస్ట్రేలియా తను ఆడిన మొదటి టెస్టు మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఇంగ్లాండ్, పాకిస్థాన్ రెండో మ్యాచ్‌లో విజయం అందుకోగా, ఇప్పుడు వీరితో సంయుక్తంగా అఫ్గానిస్థాన్ జట్టు చేరింది. ఇక వెస్టిండీస్ (6), జింబాబ్వే (11), దక్షిణాఫ్రికా (12), శ్రీలంక (14), భారత్ (25), బంగ్లాదేశ్ (35), న్యూజిలాండ్ 45వ మ్యాచ్‌లో మొదటి విజయాన్ని అందుకొని, ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.
చిత్రం.. సిరీస్ గెలిచిన ఆనందంలో అఫ్గానిస్థాన్ క్రికెటర్లు