క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ‘సూపర్’ విన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, మార్చి 20: శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో అతిథ్య దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదిం చింది. ముందుగా టాస్ గెలిచిన దక్షిణా ఫ్రికా పర్యటక జట్టు శ్రీలంకను బ్యాటిం గ్‌కు ఆహ్వానించింది. లంక బ్యాట్స్‌మెన్ల లో కమిందు మెండీస్ (41) మినహా మరెవరూ రాణించకపోవడంతో 20 ఓవర్లలో 7 కోల్పోయ 134 పరుగులు చేసింది. దీంతో లక్ష్యం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయ 134 పరుగులు చేయడం తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కీపర్ డేవిడ్ మిల్లర్ 941) మినహా మరెవరూ రాణించలేదు. లంక బౌలర్లలో కెప్టెన్ లసిత్ మలింగ 2, ధనుంజయ డీసిల్వా, అఖిల ధనుంజ య, జెఫ్రీ వండర్సె తలో వికెట్ తీసుకున్నారు.
మళ్లీ మిల్లరే..!
మ్యాచ్ డ్రాగా ముగియడంతో అంపైర్లు సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడించారు. కెప్టెన్ మలింగ బౌలింగ్ చేయగా, బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణా ఫ్రికా 6 బంతుల్లో 14 పరు గులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంక ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. లంక చేసిన పరుగుల్లో రెండు ఎక్స్‌ట్రా ల రూపంలోనే రావడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ మిల్లర్‌కు లభించింది. మిల్లర్ ఈ మ్యాచ్‌లో ఒక క్యాచ్, స్టాంపౌట్‌తో పాటు 23 బంతుల్లో 41 పరు గులు చేశాడు. అంతేకాకుండా సూపర్ ఓవర్ 5 బం తుల్లోనే 13 పరుగులు చేశాడు.

చిత్రం.. మ్యాచ్ గెలిచిన అనంతరం దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ఆనందం