క్రీడాభూమి

వార్న్ సూచనలే మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ సూచనలు, సలహాలే తనకు మార్గదర్శకాలని నేపాల్ యువ స్పిన్నర్ సందీప్ లామిచానే అన్నాడు. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ కేపిటల్స్ తరఫున బరిలోకి దగుతున్న అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను వార్న్‌కు వీరాభిమానని చెప్పాడు. ఇప్పుడు ఆయనే స్వయంగా తనకు సలహాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లోనే వార్న్‌ను కలిశానని, ఆయన ఇచ్చిన సలహాలు తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడతున్నాయని 18 ఏళ్ల ఈ యువ బౌలర్ అన్నాడు. ఎలాంటి జంకు లేకుండా, ధైర్యంగా బంతులు వేయాలని, క్రీజ్‌లో ఎవరు ఉన్నారనే విషయంపై దృష్టి పెట్టకూడదని వార్న్ తనకు చెప్పినట్టు లామిచానే అన్నాడు. ఈనెల 23 నుంచి మొదలయ్యే ఈ సీజన్‌లోనూ వార్న్ నుంచి తాను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్‌లోనూ వార్న్ సూచనలతో తాను మెరుగ్గా బౌల్ చేశానని అన్నాడు. ‘నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడగలుగుతానో లేదో నాకే తెలియదు. కానీ, ఎప్పుడు అవకాశం దొరికినా వార్న్ లాంటి గొప్ప స్పిన్నర్ల నుంచి సూచనలు తీసుకుంటునే ఉంటాను. మైదానంలోకి దిగిన ప్రతిసారీ శక్తివంచన లేకుండా, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే కృషి చేస్తాను’ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.