క్రీడాభూమి

స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: అబూదబీలో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండించింది. 85 స్వర్ణాలుసహా మొత్తం 368 పతకాలను కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో భారత్ తరఫున బరిలోకి దిగిన 284 అథ్లెట్లు 85 స్వర్ణాలతోపాటు 154 రజతాలు, 129 కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. వీటిలో పవర్‌లిఫ్టర్లు అందించిన పతకాలు ఎక్కువ. ఈ విభాగంలో భారత్‌కు 20 స్వర్ణం, 33 రజతం, 43 కాంస్య పతకాలు లభించాయి. రోలర్ స్కేటింగ్ విభాగంలో 13 స్వర్ణం, 20 రజతం, 16 కాంస్య పతకాలతో మొత్తం 49 పతకాలను భారత్ సొంతం చేసుకుంది. అదే విధంగా సైక్లింగ్‌లో 45 (11 స్వర్ణం, 14 రజతం, 20 కాంస్యం), ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో 39 (5 స్వర్ణం, 24 రజతం, 10 కాంస్యం) చొప్పున పతకాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.