క్రీడాభూమి

అలా ఆలోచిస్తే.. ఐదు మ్యాచ్‌లు కూడా ఆడను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 23: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ చురుకైన కెప్టెన్ కాదంటూ, 11 సీజన్లలో జట్టుకు ఒక్క టైటిల్ కూడా అందించలేదని, ఇప్పటికీ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు ఆర్సీ బీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలపాలంటూ రెండు రోజుల క్రితం మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ స్పందించారు. ‘బయటి వాళ్లలా నేను ఆలోచిస్తే ఐదు మ్యాచ్‌లు కూడా ఆడ కుండానే ఇంట్లో కూర్చుం టాను. చాలామంది ఇలా విమర్శలతో వార్త ల్లో నిలవాలని కోరుకుంటున్నారని నా కు తెలుసు. కానీ నాకంటూ ఓ బాధ్య త ఉంది. కెప్టెన్‌గా జట్టుకు టైటిల్‌ను అందించాలని కోరుకుం టున్నా. ఐపీ ఎల్ టైటిల్ గెలవాలని నేనూ కోరు కుంటున్నాను. దానికోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా. కానీ కేవ లం ఐపీఎల్ టైటిల్ ఆధారంగా నా సామర్థ్యాన్ని అంచనా వేయడాన్ని ఒప్పుకోను’ అని కోహ్లీ అన్నాడు. ‘క్రీడాకారుడి ప్రతిభను అంచనా వేయడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు. ప్రతిసారీ టైటిల్ గెలవాలనే కో రుకుంటా. కానీ అన్నిసార్లు అది సాధ్యపడదు. సాధ్యమైనంత వరకు గెలవడానికే ప్రయత్నాస్తా. నా కెరీర్‌లో ఎన్ని టైటిల్లు గెలవాలని భావిస్తానో అన్నీ గెలిచి తీరుతా’నని పేర్కొన్నాడు. కాగా, శుక్రవారం గంభీర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.