క్రీడాభూమి

సాదాసీదాగా ఐపీఎల్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈసారి తారల తళుకులు లేవు.. డీజేల హోరు లేదు.. చీర్ గర్ల్స్ చిందులు లేవు.. ఎప్పుడూ అట్టహాసంగా మొదలయ్యే ఐపీఎల్ ఈసారి ఎలాంటి ఆర్భాటం లేకుండా శనివారం ప్రారంభమైంది. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి సంతాప సూచకంగా, ప్రారంభోత్సవాన్ని జరపరాదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పాలనాధికారుల బృందం (సీఓఏ) నిర్ణయించింది. టాస్‌ను నిర్ణీత సమయాని కంటే 10 నిమిషాలు ముందుగానే వేసి, మిలటరీ బ్యాండ్ ప్రదర్శనకు అవకాశం కల్పించారు. అనంతరం రెండు కోట్ల రూపాయల చెక్కును సీఆర్‌పీఎఫ్ అధికారులకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అందచేశాడు. సాయుధ దళాలకు బీసీసీఐ మొత్తం 20 కోట్ల రూపాయల సాయాన్ని అందించింది. ఇందులో భారత సైన్యానికి 11 కోట్ల రూపాయలు, సీఆర్‌పీఎఫ్‌కు 7 కోట్లు, నావికా దళం, వాయుసేనకు చెరో కోటి రూపాయలు. మొదటి మ్యాచ్ ప్రొసీడింగ్స్ మొత్తాన్ని సీఆర్‌పీఎఫ్‌కు అందించనున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే టికెట్ల ద్వారా వచ్చిన రెండు కోట్ల రూపాయలను సీఆర్‌పీఎఫ్ ప్రతినిధులకు ధోనీ అందచేశారు. ఈ కార్యక్రమంలో సీఓఏ సభ్యులు డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ జనరల్ రవి థోడ్గే, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆర్మీ జనరల్ సంజీవ్ కనాల్‌కు రవి థోడ్గే 11 కోట్ల రూపాయల చెక్కును అందచేశాడు. రీర్ అడ్మిరల్ అలోక్ భట్నాగర్‌కు సీకే ఖన్నా కోటి రూపాయల చెక్కును ఇచ్చారు. అనిరుద్ధ్ చౌదరి నుంచి కోటి రూపాయల చెక్కును గ్రూప్ కెప్టెన్ దీపక్ అహ్లూవాలియా స్వీకరించాడు. సీఆర్‌పీఎఫ్ డీఐజీ ఎస్. ఎలాంగోకు 11 కోట్ల రూపాయల చెక్కును ఎడుల్జీ అందచేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ మొత్తాన్ని సాయుధ దళాలకు విరాళంగా ఇస్తే మంచిదని నిర్ణయించామని, ఈ ప్రతిపాదనకు అందరూ సానుకూలంగా స్పందించారని తెలిపింది.

చిత్రం..సీఆర్‌పీఎఫ్ అధికారులకు రెండు కోట్ల రూపాయల చెక్కును అందజేస్తున్న
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ