క్రీడాభూమి

5వేల క్లబ్‌లో రైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 24: చెన్నై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో 19 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ఐపీఎల్ లో 5వేల పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. 173 ఇన్నింగ్స్‌లు ఆడిన రైనా 34.27 యావరేజ్‌తో 5004 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇందు లో ఒక సెంచరీ, 35 అర్ధ సెంచరీలుం డగా, 28 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో రాయల్ ఛాలెం జర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కొనసాగుతున్నారు. 156 ఇన్నిం గ్స్‌లు ఆడిన కోహ్లీ 38.10 యావరే జ్‌తో 4954 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలుండగా, 34 అర్ధ సెంచరీలున్నాయ. 26 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇక 168 ఇన్నిం గ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 31.86 యా వరేజ్‌తో 4493 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 34 అర్ధ సెంచ రీలున్నాయ. 27 సార్లు నాటౌట్‌గా ని లిచాడు. వీరి తర్వాతి స్థానాల్లో మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ 152 ఇ న్నింగ్స్‌ల్లో 4217, రాబిన్ ఉతప్ప 158 ఇన్నింగ్స్‌ల్లో 4086, శిఖర్ ధావన్ 142 ఇన్నింగ్స్‌ల్లో 4058, ధోనీ 158 ఇన్నిం గ్స్‌ల్లో 4016 వరుసగా ఉన్నారు.