క్రీడాభూమి

ఐదు పదుల వయసు దాటినా.. మళ్లీ ఒలింపిక్ బరిలోకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 13: లాంగ్ జంప్‌లో పాతికేళ్ల క్రితం ప్రపంచ రికార్డు సృష్టించిన అమెరికా మేటి అథ్లెట్ మైక్ పావెల్ (52) ఇప్పటికీ తన శక్తిసామర్ధ్యాలపై ధీమాతో ఉన్నాడు. ఐదు పదుల వయసు దాటినప్పటికీ తనలో చేవ తగ్గలేదని అతను స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరిగే ఒపింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తానని పావెల్ సంచలన ప్రకటన చేశాడు. ‘ప్రస్తుతం లాంగ్ జంప్ పరిస్థితి ఎందో దయనీయంగా ఉంది. ప్రపంచంలో మరే క్రీడలోనూ లేనంతగా లాంగ్ జంప్ వెనుకబడింది. గత కొంత కాలం నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో యువ లాంగ్ జంపర్లు కనబరుస్తున్న పేలవ ప్రదర్శనను గమనిస్తున్నా. వీరితో పోటీ పడితే నేనే గెలుస్తానని తెలుసు’ అని పావెల్ పేర్కొన్నాడు. ఐటి దిగ్గజ సంస్థ టిసిఎస్ నిర్వహించనున్న వరల్డ్ 10కె ఇంటర్నేషనల్ ఈవెంట్‌కు పావెల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం బెంగళూరులో ఈ ఈవెంట్ జరుగనున్న నేపథ్యంలో పావెల్ శుక్రవారం కొద్దిసేపు విలేఖర్లతో ముచ్చటించాడు. ఈ ఏడాది రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యానని అతను స్పష్టం చేశాడు. ‘రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటానని నా కుమార్తెలకు చెప్పా. అందుకు వారు హర్షాన్ని వ్యక్తచేసి నాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు. కేవలం నా కుమార్తెల కోసమే కాకుండా, ఐదు పదుల వయసు దాటినంతమాత్రాన వృద్ధాప్యంలో ప్రవేశించినట్లు కాదని అందరికీ తెలియజెప్పేందుకే మళ్లీ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని నిశ్చయించుకున్నా. ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. జపాన్‌లో మూడేళ్ల క్రితం సెలబ్రిటీ టీవీ లాంగ్ జంప్ పోటీల్లో పాల్గొనేందుకు నన్ను ఆహ్వానించినప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నా. రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగితే యువ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా పతకాన్ని కూడా కైవసం చేసుకోగలనని నాకు తెలుసు’ అని పావెల్ తెలిపాడు. ప్రస్తుతం అమెరికా ఒలింపిక్ జట్టులో అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తున్న పావెల్ 8.15 మీటర్ల అర్హత లక్ష్యాన్ని అధిగమించగలనని గట్టి నమ్మకంతో ఉన్నాడు.