క్రీడాభూమి

రైడర్స్.. అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కొండంత లక్ష్యం.. అవతలి వైపు దిగ్గజ బౌలర్లు.. అయనా కోల్‌కతా జంకలేదు! ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌ను మరో రెండు బంతులుండగానే 6 వికెట్ల తేడాతో గెలిచింది! ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆతిథ్య జట్టు హైదరాబాద్ సన్‌రైజర్ సను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సన్‌రైజర్స్ నిర్ణత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయ 181 పరుగులు చేసింది. బాల్ ట్యాంపరింగ్‌తో ఏడాది పాటు క్రికెట్ దూరమైన డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తనదైన షాట్లతో అభిమానులను అలరించాడు. ఇన్నాళ్ల పరుగుల దాహాన్ని ఒక్కసారిగా తీర్చుకున్నాడు. అర్ధ సెంచరీ సాధించి, జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఓపెనర్లుగా వచ్చిన డేవిడ్ వార్నర్, జానీ బెయర్ స్టో మొదటి నుంచే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఏడాది కాలం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన వార్నర్ బౌండరీలతో చెలరేగాడు. అండ్రూ రస్సెల్ వేసిన 9వ ఓవర్ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచి తన ఐపీఎల్ కెరీర్‌లో 37 అర్ధ సెంచరీ సాధించి, తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అప్పటికే సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ జోడని పీయూష్ చావ్లా వీడదీశాడు. 13వ ఓవర్ ఐదో బంతికి జానీ బెయర్ స్టో (39) బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ వచ్చి రావడంతోనే కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు సెంచరీకి చేరువైన వార్నర్ (85)ను రస్సెల్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికే 16 ఓవర్లలో సన్‌రైజర్స్ 2 వికెట్లను నష్టపోయ 144 పరగులు చేసింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన యూసుఫ్ పఠాన్ (1) నిరాశ పరచగా, మనీష్ పాండ్ (8, నాటౌట్)తో కలిసి విజయ్ శంకర్ (40, నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు స్కోరును 181 చేర్చారు. కోల్‌కతా బౌలర్లలో అండ్రూ రస్సెల్‌కు 2, పీయూష్ చావ్లాకు 1 వికెట్ దక్కింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా ఆదిలోనే ఓపెనర్ క్రిస్ లీన్ (7) వికెట్‌ను కోల్పోయంది. మరో ఓపెనర్ నితీశ్ రాణా (68), రాబిన్ ఉతప్ప (35) రాణించగా, కెప్టెన్ దినేష్ కార్తీక్ (2) నిరాశ పరిచాడు. చివర్లో అండ్రూ రస్సెల్ (49), శుభ్‌మాన్ గిల్ (18) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ మినహా షకీబ్ అల్ హసన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, రషీద్ ఖాన్‌లకు తలో వికెట్ లభించింది.
స్కోర్ బోర్డు:
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సీ) ఉతప్ప (బీ) రస్సెల్ 85, బెయర్‌స్టో (బీ) చావ్లా 39, విజయ్ శంకర్ (నాటౌట్) 40, యూసుఫ్ పఠాన్ (బీ) రస్సెల్ 1, మనీష్ పాండే (నాటౌట్) 8.
ఎక్స్‌ట్రాలు: 8 మొత్తం: 181 (20 ఓవర్లలో 3 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-118, 2-144, 3-152
బౌలింగ్: ప్రసిధ్ క్రిష్ణ 4-0-31-0, పియూష్ చావ్లా 3-0-323-1, లాకీ ఫెర్గూసన్ 4-0-34-0, సునీల్ నరైన్ 3-0-29-0, కుల్దీప్ యాదవ్ 2-0-18-0, అండ్రూ రస్సెల్ 3-0-32-2, నితిష్ రానా 1-0-9-0.
కోల్‌కతా ఇన్నింగ్స్: క్రిస్‌లీన్ (సీ) రషీద్‌ఖాన్ (బీ) షకీబ్ 7, నితీష్ రాణా ఎల్‌బీ (బీ) రషీద్‌ఖాన్ 68, రాబిన్ ఉతప్ప (బీ) కౌల్ 35, దినేష్ కార్తీక్ (సీ) భువనేశ్వర్ (బీ) సందీప్ 2, అండ్రూ రస్సెల్ 49 (నాటౌట్), శుభ్‌మాన్ గిల్ (నాటౌట్) 18.
ఎక్స్‌ట్రాలు: 4 మొత్తం: 183 (19.4 ఓవర్లలో 4 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-7, 2-87, 3-95, 4-118
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-437-0, షకిబ్ అల్ హసన్ 3.4-0-42-1, సందీప్ శర్మ 4-0-42-1, సిద్దార్థ్ కౌల్ 4-0-35-1, రషీద్ ఖాన్ 4-0-26-1.
చిత్రాలు.. అర్ధ సెంచరీతో జట్టును గెలిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీశ్ రాణా
*మ్యాచ్‌ను వీక్షిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్ స జట్టు యజమాని షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటి జూహీచావ్లా