క్రీడాభూమి

బుమ్రా గాయంపై ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, మార్చి 25: ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, అతడు వచ్చే మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడ ని ఆ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటి ంచిం ది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి బంతికి రిషభ్ పంత్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు ప్రయ త్నించగా ఎడమ భుజానికి గాయమై బుమ్రా విలవిల్లాడాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇన్నిం గ్స్ ముగియడానికి మరో నాలుగు బంతులు మిగిలి ఉన్నా బుమ్రా బ్యాటింగ్‌కు రాకపోవడం, మరో నెల రోజుల్లో ప్రపంచకప్ ముందు బు మ్రా గాయపడడంపై అభిమానులం తా ఆందోళనకు గురయ్యారు. అయ తే ముంబై ఇండియన్స్ యాజమా న్యం మాత్రం బుమ్రా వచ్చే మ్యాచ్ లో ఆడతాడని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.