క్రీడాభూమి

నేను చేసింది తప్పుకాదు: రవిచంద్రన్ అశ్విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 26: తాను చేసింది ముమ్మాటికీ తప్పేం కాదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆట తీరును సమర్థిం చుకున్నాడు. తాను నిబంధన ప్రకార మే ఆడానని, క్రీడా స్ఫూర్తి అని అంతా మాట్లాడు తున్నారని అసహనం వ్యక్తం చేశా డు. ఆటలో నిబంధనలకు మినహా యంపేం కాదు కదా అని అభిప్రాయపడ్డా డు. ఈ ఘట నపై జోస్ బట్లర్‌తో పాటు రాజస్థాన్ కెప్టెన్ అంజిక్యా రహానె, కోచ్ ప్యాడీ అష్టన్ వ్యతిరేకించారు.
బట్లర్‌కు రెండోసారి..
మన్కడింగ్ నిబంధన తో గతంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ రెండు సార్లు పెవిలియన్‌గా చేరగా, తాజాగా ఇదే నిబం ధనతో ఐపీఎల్‌లో పెవిలియ న్ బాట పట్టిన ఇంగ్లాండ్, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ కూడా రెండు సార్లు అవుటయ్యాడు. 2014లో బర్మింగ్ హోమ్‌లో శ్రీలంకతో జరిగిన వనే్డలో అప్పటి శ్రీలంక బౌలర్ సచిత్ర సేనానాయకే బట్లర్‌ను ఇదే తరహా పెవిలియన్ చేర్చాడు. ఇక రెండోసారి సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన బట్లర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ప్రయోగించి, పెవిలియన్ చేర్చాడు.