క్రీడాభూమి

తారుమారైన ఫలితాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 26: ఐపీఎల్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ మన్కడింగ్ పద్ధతిలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను అవుట్ చేశాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 14 పరుగుల తేడాతో ఓటమి చూసింది. అప్పటికే బట్లర్ అర్ధ సెంచరీ సాధించడంతో గెలుపు ఖాయమను కున్నారంతా. అనూహ్యంగా అశ్విన్‌లో చేతిలో అవుట్ కావడంతో మ్యాచ్ చేజారింది.
2016లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లోనూ మన్కడింగ్ నిబంధన వివాదం రేపింది. చిట్టగాంగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ కిమో పాల్ నాన్ స్ట్రైక్‌లో ఉన్న జింబాబ్వే బ్యాట్స్‌మెన్ రిచర్డ్ నగరావను మన్కడింగ్ పద్ధతిలో పెవిలియన్‌కు పంపాడు. అప్పటికీ చివరి బంతికి కేవలం రెండు పరుగులు చేస్తే జింబాబ్వే విజయం సాధిస్తుందనగా, అనూహ్యంగా మ్యా చ్‌ను ఓడింది. ఈ ఘటనతో పలువురు క్రికెటర్లు కిమో పాల్ తీరుపై విరుచుకుపడ్డారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ మండిపడ్డారు.