క్రీడాభూమి

ప్రపంచకప్ జట్టును ప్రకటించిన కివీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఏప్రిల్ 3: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బుధవారం 15మంది సభ్యులుగా గల ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. జట్టులోకి టామ్ బ్లండెల్‌ను బ్యాకప్ కీపర్‌గా తీసుకోగా, ఆల్‌రౌండర్ డాగ్ బ్రాస్‌వేల్ స్థానంలో కొలిన్ డీగ్రాండ్ హోంకు అవకాశం కల్పించింది. వనే్డ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్, ఇం గ్లాండ్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతోంది. గత ఐదు ప్రపంచకప్‌లలో సెమీ ఫైనల్ నుంచే ఇంటి ముఖం పడుతున్న కివీస్ 2015లో మాత్రం ఫైనల్ కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఫైనల్ మ్యా చ్‌లో 183 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. కాగా, గత పరాజయాలను దృష్టిలో ఉంచుకొని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లో మెరుగ్గా రాణిస్తున్న ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసినట్లు పేర్కొన్నా రు. అయతే ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడ్ని టామ్ బ్లాండెల్‌ను జట్టులోకి తీసు కొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తన మొదటి మ్యాచ్‌ను జూన్ 1న కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో ఆడనుంది.
న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టు: కేన్ విలి యమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డీగ్రాండ్ హోం, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, కొలిన్ మున్రో, జిమ్మి నీషమ్, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంత్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, రాస్ టేలర్.