క్రీడాభూమి

వారిద్దరి వికెట్లు తీయడం నా కెరీర్‌లోనే బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 3: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డి విలీయర్స్ వికెట్లు తీయడం నా క్రికెట్ కెరీర్‌లోనే అత్యుత్తమమైన మధుర క్షణమని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గోపాల్ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను అవుట్ చేస్తానని అనుకోలేదని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో 7వ ఓవర్ వేసిన ఈ లెగ్ స్పిన్నర్ అద్భుతమైన గూగ్లీతో కోహ్లీని బౌల్డ్ చేయగా, ఆ తర్వాతి ఓవర్‌లో డివిలీయర్స్‌ను రిటర్న్ క్యాచ్ ద్వారా పెవిలియన్‌కు పంపించాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్ 12 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
చిత్రం.. శ్రేయాస్ గోపాల్