క్రీడాభూమి

భారత్‌కు 101వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా గురువారం ప్రకటించిన తాజా ప్రపంచ సాకర్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 101వ స్థానం లభించింది. 103వ స్థానంలో ఉన్న భారత్ రెండు స్థానాలను మెరుగుపరచుకుంది. భారత్ ఖాతాలో మొత్తం 1,219 ర్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆసియా దేశాల్లో భారత్‌కు 18వ స్థానం దక్కింది. కాగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలను ఆక్రమించిన దేశాల్లో ఇరాన్ అగ్రస్తానంలో ఉంది. ప్రస్తుతం ఇరాన్ 21వ స్థానాన్ని దక్కించుకుంది. జపాన్ 26, దక్షిణ కొరి యా 37 స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో బెల్జియం 1,737 పాయింట్లతో నంబర్ వన్‌గా నిలిచింది. 1,734 పాయింట్లతో ఫ్రాన్స్, 1,676 పాయింట్లతో బ్రెజిల్, 1,647 పాయింట్లతో ఇంగ్లాండ్, 1,621 పాయింట్లతో క్రొయేషియా వరుసగా రెండు నుంచి ఐదు స్థానాలను ఆక్రమించాయి.