క్రీడాభూమి

శ్రీలంక క్రికెటర్ లొకుహెట్టిగేపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఏప్రిల్ 4: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ దిల్హారా లొకుహెట్టిగేపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ సమయంలో అతను సరైన సమాచారం ఇవ్వలేదని, అనుమానాలను నివృత్తి చేసే ఆధారాలు ఏవీ సమర్పించలేదని ఐసీసీ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే, అతనిని రెండు వారాల పాటు సస్పెండ్ చేశామని, ఈలోగా సరైన సమాచారాన్ని విచారణ కమిటీకి అందించాల్సి ఉంటుందని వివరించింది. మీడియం పేసర్‌గా లొకుహెట్టిగే తొమ్మిది వనే్డలు, రెండు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన టీ-10 లీగ్‌లో ఆడాడు. యూఏఈ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలోనే అతను ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. బుకీలు తనను కలిసి విషయాన్ని దాచి ఉంచడం ద్వారా అవినీతి నిరోధక నిబంధనను అతను ఉల్లంఘించాడని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కేసును ఐసీసీ కమిటీ విచారిస్తున్నది. సరైన సమాచారం ఇవ్వని కారణంగా అతనిని రెండు వారాల పాటు సస్పెండ్ చేసిన ఐసీసీ, సాధ్యమైనంత త్వరలో వివరాలు సమర్పించాలని సూచించింది.