క్రీడాభూమి

యువ క్రికెటర్లకు నైపుణ్య శిక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: యువ క్రికెటర్లకు నైపుణ్య శిక్షణ అవసరమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నాడు. భారత ‘ఏ’ జట్టుతోపాటు అండర్-19 జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ చేసిన సూచనను ఆయన సమర్థించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ)కు డైరెక్టర్‌గానూ సేవలు అందిస్తున్న ద్రవిడ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, యువ క్రికెటర్లకు నైపుణ్య శిక్షణ అత్యవసరమని పేర్కొన్నాడు. క్రికెట్‌ను కూడా వృత్తిగా తీసుకుంటున్న వారికి, ఆ తరహాలోనే శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే సమర్థులైన ఆటగాళ్లను తయారు చేయగలుగుతామని అన్నాడు. ద్రవిడ్ చేసిన ఈ సూచనకు ఖన్నా సానుకూలంగా స్పందించాడు. సమర్థులైన యువ క్రికెటర్లకు నైపుణ్య శిక్షణను ఇప్పించడం వల్ల, వారిని నిజ జీవితంలోనూ అన్ని ఆటుపోట్లను తట్టుకునే వీరులుగా తీర్చిదిద్దవచ్చని ద్రవిడ్ చేసిన సూచనతో తాను ఏకీభవిస్తున్నానని ఖన్నా అన్నాడు. దేశంలో సమర్థులైన యువ క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని, వారికి సరైన శిక్షణ అవసరమని చెప్పారు. జోనల్ క్రికెట్ ఆకాడెమీ (జెడ్‌సీఏ)లు ఆటగాళ్లకు ఇలాంటి శిక్షణను ఇప్పించి, వారివారి సామర్థ్యం ప్రకారం ర్యాంకింగ్స్ ఇవ్వాలని సూచించాడు. క్రికెట్‌లోనేగాక, జీవితంలోనూ వారు అన్ని విధాలా నిలదొక్కుకునేలా శిక్షణ ఉండాలని హితవు పలికాడు. ఈ విషయాలను క్రోడీకరిస్తూ తాను ఒక ముసాయిదాను సిద్ధం చేశానని, త్వరలోనే దానిపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించాడు. నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు, అత్యంత కీలక సమయాల్లో, సరైన రీతిలో నిర్ణయాలు తీసుకునేలా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందన్నాడు. ఐపీఎల్ వంటి టోర్నీల ద్వారా గతంలో ఎన్నడూ లేనంత లేదా ఊహించనంత మొత్తాలను యువ క్రికెటర్లు ఆర్జిస్తున్నారని చెప్పాడు. అలాంటి సమయాల్లో, వారు సంయమనం కోల్పోయే ప్రమాదం ఉందన్నాడు. అందుకే, యువ ఆటగాళ్లు తప్పుదారి పట్టకుండా ఉండేందుకు వారిని మానసికంగానూ బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్టు ఖన్నా చెప్పాడు.