క్రీడాభూమి

23 మందితో పాకిస్తాన్ ప్రపంచకప్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఏప్రిల్ 5: వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్‌కు పాకిస్తా న్ క్రికెట్ జట్టు 23మంది సభ్యులుగల జట్టును ఎంపిక చేసింది. అయతే ఈ 23మందిలో తుది జట్టుకు ఎంపికయ్యే 15మంది ఎవరనేది స్పష్టం చేయలేదు. దీంతో ఆటగాళ్లతో పా టు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ ప్రక టించిన 23 మంది ప్రాబబుల్స్ జట్టులో పేర్లతో పాటు ఐసీసీ ట్వీట్ చేసింది.
పాకిస్తాన్ ప్రకటించిన జట్టు: సర్ఫరాజ్ అహ్మద్, అబిద్ అలీ, అసిఫ్ అలీ, బాబర్ అ జాం, ఫహీమ్ అష్రాఫ్, ఫకార్ జమాన్, హారీస్ సోహైల్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఇమాముల్ హాక్, జునైద్ ఖాన్, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ హస్‌నైన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రీదీ, షాన్ మసూద్, షోయాబ్ మాలిక్, ఉస్మాన్ షిన్వారి, యాసిర్ షా.
అఫ్గాన్ కూడా..
అఫ్గానిస్థాన్ జట్టు కూడా 2019 ప్రపంచకప్‌కు 23 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయతే దక్షిణాఫ్రికాలో ఆరు ప్రాక్టీస్ మ్యాచ్‌ల అనంతరం కాబూల్ వెళ్లే ముందు 15 మంది సభ్యులు గల జట్టును ప్రకటిస్తామని ఏసీబీ (అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు) స్పష్టం చేసింది.
అఫ్గాన్ జట్టు: గుల్బాదిన్ నబీ (కెప్టెన్), రషీద్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహమ్మద్ షాహజాద్, నూర్ అలీ జర్దాన్, హజ్రతుల్లా జజాయ, ఉస్మాన్ గనీ, అస్గార్ అఫ్గాన్, హష్మతుల్లా షాహిదీ, రహమత్ షా, మహమ్మద్ నబీ, నజీబ్ జర్దాన్, డార్విష్ రసూలీ, ముజీబ్ ఉర్ రహమన్, షాఫీఖుల్లా షాఫఖ్, దౌలత్ జర్దాన్, అఫ్టాబ్ అలామ్, షాపూర్ జర్దాన్, హమీద్ హస్సన్, కరీం జనత్, ఖైసీ అహమ్మద్, షరఫుద్దీన్ అష్రాఫ్, సయ్యద్ షిర్జాద్, సమీఉల్లా షిన్వారీ.