క్రీడాభూమి

అఫ్గాన్ వనే్డ కెప్టెన్‌గా గుల్బాదిన్ నబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్గానిస్థాన్, ఏప్రిల్ 5: అఫ్గానిస్థాన్ వనే్డ కెప్టెన్‌గా గుల్బాదిన్ నబీని ఎంపిక చేసినట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ పేర్కొంది. అంతకుముందు కెప్టెన్ గా వ్యవహరించిన అస్గార్ అఫ్గాన్‌ను మూడు ఫార్మాట్ల నుంచి బోర్డు తప్పిం చింది. అఫ్గాన్ కెప్టెన్సీలో ఇటీవలే ఐర్లాం డ్ జట్టుపై టెస్టు, వనే్డ, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయతే తాజాగా బోర్డు మూడు ఫార్మాట్ల కు ముగ్గురు కెప్టెన్లను నియమిం చింది. వనే్డ జట్టుకు గుల్బాదిన్ నబీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్ పేరును ప్రకటించింది. టీ20ల్లో రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహ రించనుండగా, షాఫఖ్ షిన్వారై పేరును వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. ఇక టెస్టుల్లో రహమత్ షా కెప్టెన్‌గా, హష్మత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిం చినట్లు వెల్లడించింది.
అస్గార్ కెప్టెన్సీలో విజయాలు..
అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గాన్ అఫ్గాన్ కెప్టెన్సీలో జట్టు మంచి విజయా లు సాధించింది. 56 వనే్డల్లో 31 విజయా లు సాధించింది. అలాగే 46 టీ20ల్లో 37 విజయాలను నమోదు చేయగా, ఆడిన రెండు టెస్టుల్లో భారత్‌పై పరాజయం చెందగా, ఐర్లాండ్‌పై విజయం సాధించి, ఆడిన రెండో టెస్టులోనే విజయం సాధిం చిన జట్టుగా రికార్డు సృష్టించింది.
నబీ సారథ్యంలోనే ప్రపంచకప్‌కు..
ఇదిలాఉంటే జట్టుకు కెప్టెన్‌గా నూతనంగా నియమించిన గుల్బాదిన్ నబీ సారథ్యంలో అఫ్గానిస్థాన్ జట్టు మే 30న జరిగే ప్రపంచకప్‌కు వెళ్తుం దని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు నబీని పలువురు క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.