క్రీడాభూమి

కప్ కలేనా? కోహ్లీ జట్టుకేమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 6: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టకు ఈ సీజన్‌లోనూ నిరాశే ఎదురవుతోంది! గత సీజన్లలో కప్‌ను ముద్దాడని బెంగళూరు, ఈసారి తప్పకుండా ఆ లోటు భర్తీ చేస్తుందిలే అని సంబ రపడ్డ అభిమానుల్లో ఆశలు సన్నగిల్లు తున్నాయ! 2019 సీజన్‌లో కోహ్లీ సేన ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి చవిచూసింది. జట్టులో హేమాహేమీలున్నా కనీసం ప్రత్యర్థి జట్లకు పోటీనివ వలేక పోతోం ది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే కేవలం 70 పరుగులు మాత్రమే చేసి ఈ సీజన్‌లో మొట్ట మొదటి అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అక్కడితో మొదలైన పరా జయాల పరంపర కోహ్లీ సేనను కోలు కోనివ్వలేదు. రెండో మ్యాచ్‌లో ముంబైతో తలపడిన బెంగళూరు బాగానే ఆడినా చివరి క్షణాల్లో తడబ డడంతో 6 పరుగుల తేడాతో పరాజ యం పాలైంది. ఈ మ్యాచ్‌లో సీని యర్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (70, నాటౌట్), కెప్టెన్ కోహ్లీ (46) రాణించినా జట్టును గెలిపించలేకపో యారు. ఇక సన్‌రైజర్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ప్రత్యర్థి ఉంచిన లక్ష్యాన్ని ఛేదించలేక 113 పరుగులకే కుప్పకూలి, 118 పరుగుల భారీ తేడాతో ఓడిపోయంది. రాజస్థాన్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు జట్టు, శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా పరాజయమే వెంటాడింది. ఇ ప్పటికే ప్లే ఆఫ్‌లో 5 మ్యాచ్‌లాడిన కోహ్లీసేన మిగతా మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుం దనేది వేచి చూడాలి.
గత ఐదు మ్యాచ్‌ల్లో కోహ్లీ, డివిలియర్స్ చేసిన పరుగులు
కోహ్లీ డివిలియర్స్
6 (12) 9 (10)
46 (32) 70 (41)
3 (10) 1 (2)
23 (25) 13 (9)
84 (49) 63 (32)