క్రీడాభూమి

ధోనీ మరోసారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 10: చెన్నై1స్టేడియంపై ధనాధన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి అసహనం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ధోనీ సేన చివరి వరకూ పోరాడి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ ఇలాంటి క్రికెట్ ఎవరు ఆడతారంటూ, పిచ్ క్యూరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా పూర్తి ఓవర్లు ఆడి 108 పరుగులు మాత్రమే చేసింది. దీనికి కారణం పిచ్ నెమ్మ దించడమేనని ఇరు జట్ల ఆటగాళ్లలో అసహనం వ్యక్తమైంది. మరోవైపు ఇదే పిచ్ ఐపీఎల్ ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడాయ. అప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. ఆ మ్యాచ్‌కు ముందే పిచ్ క్యూరేటర్స్‌తో ధోనీ మాట్లాడిన ఇరు జట్లకు పిచ్ సహకరించలేదు. ఫలితంగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 70 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత స్పల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై 18 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
అప్పుడు ఇద్దరూ..
ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ చెన్నై పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా పిచ్ ఆతిథ్య జట్టుకు సహకరించే విధంగా తయారు చేస్తారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పిచ్ ఇరు జట్లకు ప్రమాదకరంగా మారి, పొట్టి ఫార్మాట్‌లోని అసలైన మాజాను ప్రేక్షకులకు దూరం చేస్తోంది.
విడదీయరాని అనుబంధం
చెన్నై పిచ్‌పై తనకు విడదీయరాని అనుబంధం ఉందని ధోనీ పేర్కొన్నాడు. తన మొద టి టెస్టు మ్యాచ్‌ను ఇక్కడే ఆడినట్టు తెలిపాడు. అంతేకాకుండా ఇండియన్ ప్రీమి యర్ లీగ్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పాడు. పిచ్ తీరు ఇలాగే ఉంటే ప్రత్యర్థి జట్లతో ఆడడం ఇబ్బందికరమేనని చెప్పుకొచ్చా డు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటిం గ్‌కు దిగిన ఇరు జట్ల ఆటగాళ్లలో కోల్‌కతా నుంచి అండ్రూ రస్సేల్ (50), చెన్నై నుంచి ఫాఫ్ డుప్లెసిస్ (43, నాటౌట్) మాత్రమే రాణించగా, మిగతా అందరూ తక్కువ స్కో రుకే పెవిలియన్ బాట పట్టారు.

చిత్రాలు.. చెన్నై పిచ్ *మహేంద్రసింగ్ ధోనీ (ఇన్‌సెట్‌లో)