క్రీడాభూమి

కోహ్లీ మరో ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: టీమిం డియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరు సగా మూడో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నా డు. 2018 సంవత్సరానికి గాను విజ్డన్ క్రికెటర్ల అవార్డులను బు ధవారం ప్రకటించారు. గతేడాది ఐదు టెస్టులాడిన కోహ్లీ 59.3 యావరేజ్‌తో 593 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలను నమోదు చేశాడు. అంతేకాకుండా మూడు ఫా ర్మాట్లలో కలిపి మొత్తం 2735 పరుగులు సాధించాడు. ఇక ఉమెన్స్ లీడింగ్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మహిళా జ ట్టు ఓపెనర్ స్మృతీ మంధాన సొంతం చేసుకుంది. మంధాన గతేడాది వనే్డల్లో 669, టీ20ల్లో 662 పరుగులు సాధించింది. ఉమెన్స్ సూపర్ లీగ్‌లోనూ మొ త్తం 421 పరుగులు సాధించిం ది. అలాగే లీడింగ్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా అప్గానిస్థాన్ జట్టుకు చెందిన స్పిన్నర్ రషీద్ ఖాన్ వరుసగా రెండో ఏడాది అవార్డుని దక్కించుకున్నాడు. వీరితో పాటు ఇంగ్లాండ్‌కు చెంది న క్రికెటర్లు టమీ బ్యూవౌంట్, జోస్ బట్లర్, శామ్ కుర్రాన్, రోరీ బర్న్స్ కూడా విజ్డన్ అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు.

చిత్రాలు.. .విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా వరుసగా మూడోసారి విరాట్ కోహ్లీ
* స్మృతీ మంధాన