క్రీడాభూమి

ఆ శిక్ష సరిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఏప్రిల్ 11: ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై ఏడాది శిక్ష సరిపోదని, వాస్తవానికి వారిని కనీసం రెండేళ్లు సస్పెండ్ చేసి ఉండాల్సిందని వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కర్ట్‌లీ అంబ్రోస్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లినప్పుడు, మూడో టెస్టు ఆడుతూ ఆసీస్ ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించి, టీవీ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అప్పటి కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్ పన్నిన వ్యూహాన్ని బాన్‌క్రాఫ్ట్ అమలు చేసినట్టు విచారణ అధికారులు ధ్రువీకరించారు. ట్యాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్‌తోపాటు స్మిత్, వార్నర్‌ను కూడా సస్పెండ్ చేశారు. కాగా, ఈ అంశాన్ని ఒక ఇంటర్వ్యూలో అంబ్రోస్ ప్రస్తావిస్తూ, హత్య చేసిన వారిని విడిచిపెట్టినట్టు ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన వారికి ఏడాది శిక్ష ఎంతమాత్రం సరిపోదని స్పష్టం చేశాడు.