క్రీడాభూమి

గంగూలీ జోడు పదవులపై అభ్యంతరాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 11: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిర్వహిస్తున్న జోడు పదవులపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కోల్‌కతా నైట్ రైడర్స్ స్పష్టం చేసింది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గంగూలీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా కూడా ఉన్నాడు. సహజంగా భారత క్రికెట్‌లో జోడు పదవుల్లో ఎవరూ కొనసాగరాదన్న ఆనవాయితీ కొనసాగుతున్నది. అయితే, క్యాబ్ అధ్యక్షుడిగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుగా సలహాదారుగా కూడా ఉండడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నైట్ రైడర్స్ కూడా ఈ విషయంపై అసహనంతో ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే, గంగూలీ జోడు పదవులను నిర్వహించడంపై తమకు అభ్యంతరాలు ఏవీ లేవని నైట్ రైడర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకీ మైసూర్ తేల్చిచెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నైట్ రైడర్స్ శుక్రవారం ఐపీఎల్ గ్రూప్ మ్యాచ్‌లో ఢీ కొంటున్న నేపథ్యంలో వెంకీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం గురించి గంగూలీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో అనుమానం లేదు. పిచ్ తీరుతెన్నుల నుంచి వాతావరణం వరకూ ప్రతి విషయంలోనూ అతనికి అవగాహన ఉంది. సలహాదారు హోదాలో అతను ఢిల్లీ క్యాపిటల్స్ కు వికెట్ పరిస్థితి గురించి వివరించడం ఖాయం. అంతేగాక, మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా అతను ముందుగానే నిర్ధారిస్తాడనడంలో సందేహం లేదు. క్యాబ్ అధ్యక్షుడి హోదాలో అతను పిచ్ తీరును ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుకూలంగా మార్పు చేయించినా ఆశ్చర్యం లేదు. గంగూలీ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్‌కు లాభం, నైట్ రైడర్స్‌కు నష్టం తప్పదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అయితే, గంగూలీ జోడు పదవులు నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని, అది అతని వ్యక్తిగత విషయమని నైట్ రైడర్స్ సీఈఓ వెంకీ స్పష్టం చేశాడు. గంగూలీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడేగాక, పాలనాదక్షుడని కితాబునిచ్చాడు. ఏం చేయాలో? ఏం చేయకూడదో? అతనికి తెలుసునని, ప్రత్యేకంగా తాము చెప్పాల్సింది ఏమీ ఉండదని పేర్కొన్నాడు. తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నాడు.