క్రీడాభూమి

సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సింధు, సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 11: ఇక్కడ జరుగుతున్న సింగపూర్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు తన ప్రత్యర్థి మియా బ్లిచ్‌ఫెల్డ్‌ను 21-13, 21-19 తేడాతో ఓడించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఆమె తన తర్వాతి మ్యాచ్‌లో చైనాకు చెందిన కెయ్ యాన్యాన్‌ను ఢీ కొంటుంది. 2017 జూనియర్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న యాన్యాన్ నుంచి సింధుకు గట్టిపోటీ తప్పదని అంటున్నారు. కాగా, సైనా 21-16, 18-21, 21-19 స్కోరుతో థాయిలాండ్‌కు చెందిన పొర్న్‌పవీ చొచువాంగ్‌పై విజయం సాధించి, క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆమె సెమీస్‌లో స్థానం కోసం జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒకుహరాతో తలపడుతుంది. కాగా, సైనా భర్త, స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చైనా ఆటగాడు చెన్ లాంగ్‌కు చివరి వరకూ గట్టిపోటీని ఇచ్చినప్పటికీ అతనికి 9-21,21-15, 16-21 తేడాతో ఓటమి తప్పలేదు. ఇలావుంటే, పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ క్వార్టర్స్ చేరాడు. చైనాకు చెందిన లూ గాంగ్జూను అతను 21-15, 21-18 ఆధిక్యంతో ఓడించాడు.