క్రీడాభూమి

రబదా వర్సెస్ రసెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో శుక్రవారం జరిగే మ్యాచ్‌ని ఫాస్ట్ బౌలర్ కాగిసో రబదా, పించ్ హిట్టర్ ఆండ్రె రసెల్ మధ్య సాగే ఆధిపత్య పోరుగా విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న దక్షిణాఫ్రికా పేసర్ రబదా నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను నానా ఇబ్బందులు పెడుతున్నాడు. నైట్ రైడర్స్‌పై గత మ్యాచ్‌ని గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అలాంటి ఫలితాన్ని సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశలన్నీ రబదాపైనే ఉన్నాయి. ఇంతకు ముందు నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లి, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సూపర్ ఓవర్‌లో 11 పరుగులు సాధించాల్సి ఉండగా, ఆ ఓవర్‌ను వేసే బాధ్యతను రబదాకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అప్పగించాడు. నైట్ రైడర్స్ సూపర్ స్టార్ రసెల్ క్రీజ్‌లో ఉండడంతో, ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి ఓటమి తప్పదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అందుకు తగ్గట్టుగానే, రాబదా వేసిన తొలి బంతిని రసెల్ బౌండరీకి తరలించాడు. అయితే, రసెల్ లాంటి హార్డ్ హిట్టర్ బ్యాటింగ్ చేస్తున్నా, తొలి బంతినే ఫోర్ కొట్టినా ఏమాత్రం ఒత్తిడికి గురికాని రబదా ప్రతిదాడికి దిగాడు. అనన్య సామాన్యమైన యార్కర్‌తో రసెల్ వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారు సౌరవ్ గంగూలీ ఆ బంతిని ‘బాల్ ఆఫ్ ది టోర్నమెంట్’గా అభివర్ణించాడంటే, రబదా ఎలాంటి యార్కర్‌ను సంధించాడో ఊహించుకోవచ్చు. కాగా, ఆ మ్యాచ్‌లో విజయం ముంటిటికి చేరిన తమను ఓడించిన ఢిల్లీకి, ప్రత్యేకించి సూపర్ ఓవర్‌లో కనీసం 11 పరుగులు కూడా ఇవ్వకుండా నియంత్రించిన రబదాకు తగిన సమాధానం చెప్పాలని నైట్ రైడర్స్ పట్టుదలతో ఉంది. సూపర్ ఓవర్‌లో జట్టును గెలించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నప్పటికీ, రబదా వేసిన అద్భుతమైన బంతికి ఔటైన రసెల్ శుక్రవారం నాటి మ్యాచ్‌లో అతనిపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడనడంలో అనుమానం లేదు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకూ ఐదు ఇన్నింగ్స్ ఆడిన రసెల్ 257 పరుగులు సాధించాడు. వీటిలో సుమారు 150 పరుగులు కేవలం సిక్సర్ల రూపంలో లభించాయి. అతని ఫామ్‌ను గురించి చెప్పడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. ఈసారి మ్యాచ్ హోం గ్రౌండ్‌లో జరగనుంది కాబట్టి, ప్రత్యర్థి జట్టు బౌలర్లపై, ప్రధానంగా రబదాపై అతను దాడిసేసి, వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేయడం ఖాయం. అదే సమయంలో రబదా కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. రసెల్‌ను కట్టడి చేస్తే, నైట్ రైడర్స్‌పై విజయం సాధించడం అసాధ్యమేమీ కాదన్నది నిజం. మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్, నైట్ రైడర్స్ మధ్య జరిగే పోటీ రబదా వర్సెస్ రసెల్‌గా మారనుంది.
చిత్రాలు..కాగిసో రబదా *ఆండ్రె రసెల్