క్రీడాభూమి

రైనా.. రైజింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈడెన్‌గార్డెన్స్: చెన్నై విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడిం టా గెలిచి పాయంట్ల పట్టికలో ఆగ్రభాగాన నిలిచింది. ఆదివా రం ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు టాస్ గెలిచిన ధోనీ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. నైట్ రైడర్స్ ఓపెనర్లు లియాన్, సునీల్ నరైన్ మొదటి నుంచే చెన్నై బౌలర్లపై విరుచు కుపడ్డారు. ముఖ్యంగా లియాన్ నలుమూలాల బౌండరీలతో తనదైన శైలిలో ఆడాడు. ఈ క్రమంలో నరైన్ (2) శాంత్నర్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రానా (21) ఫర్వాలేదనిపించినా, రాబిన్ ఊతప్ప (0) ఆడిన మొదటి బంతికే పెవిలియన్‌కు చేరాడు. దీంతో 80 పరుగులకే కోల్‌కతా 3 వికెట్లను కోల్పోయంది. ఓవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు లియాన్ (82) ఐపీఎల్‌లో ఎనిమిది, ఈ సీజన్‌లో రెండో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం పూర్తయన తర్వాత లియాన్ చెన్నై బౌలర్లపై విరు చుకుపడ్డాడు. సిక్సర్లు, బౌండరీలతో మైదానాన్ని హో రెత్తిం చాడు. ఈ క్రమంలోనే తాహీర్ వేసిన అద్భుత డెలివరీకి శార్దుల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తీక్ (18), అండ్రూ రస్సెల్ (10), శుభ్ మన్ గిల్ (15), పీయూష్ చావ్లా (4, నాటౌట్), కుల్దీప్ యాదవ్ (0) నిరాశ పరచడంతో కోల్‌కతా 8 వికెట్లను కోల్పోయ 161 పరుగులను చెన్నైకి నిర్దేశించింది. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ 4, శార్దుల్ ఠాకూర్ 2, మిచెల్ శాంత్నర్‌కు ఒక వికెట్ దక్కింది.
డుప్లెసిస్ నాలుగు క్యాచ్‌లు..
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ నాలుగు క్యాచ్‌లు (సునీల్ నరైన్, నితీష్ రానా, రాబిన్ ఊతప్ప, దినేష్ కార్తీక్) అందుకున్నాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన టెవాట్ల ముంబైతో మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సైతం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న వారిలో ఉన్నారు. గతంలో మాస్టర్ బాస్టర్ సచిన్ టెండ్కూలర్ (ముంబై, 2008), డేవిడ్ వార్నర్ (్ఢల్లీ డేర్‌విల్స్, 2010), జాక్వెస్ కలిస్ (కేకేఆర్, 2011) కూడా ఒకే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్నారు.
ఆదిలోనే ఎదురుదెబ్బ..
162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (6), ఫాఫ్ డుప్లెసిస్ (24), అంబటి రాయుడు (5) పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో మ్యాచ్ బాధ్యతనంతా సురేశ్ రైనా తీసుకున్నాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన రైనా ఆ తర్వాత చెలరేగాడు. మరోవైపు రైనాకు తోడుగా కేదార్ జాదవ్ (20) కొద్దిసేపు బౌలర్లను ప్రతిఘటించినా చావ్లా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అప్పటికీ 4 వికెట్లు కోల్పోయన చెన్నై 81 పరుగులు మాత్రమే చేసింది. దీంతో క్రీజులోకి వచ్చిన ధోనీ నెమ్మదిగానే ఇ న్నింగ్స్‌ను ప్రారంభించాడు. మరోవైపు రైనా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో ధోనీ (16) కూడా అవుటయ్యాడు. ఆ త ర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (31, నాటౌట్) సురేశ్ రైనా (58, నాటౌట్) మరో వికెట్ పడకుండా, ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.
స్కోర్ బోర్డు..
కోల్‌కతా ఇన్నింగ్స్: క్రిస్ లియాన్ (సీ) శార్దుల్ ఠాకూర్ (బీ) తాహీర్ 82, సునీల్ నరైన్ (సీ) డుప్లెసిస్ (బీ) శాంత్నర్ 2, నితీష్ రానా (సీ) డుప్లెసిస్ (బీ)తాహీర్ 21, రాబిన్ ఊతప్ప (సీ) డుప్లెసిస్ (బీ) తాహీర్ 0, దినేష్ కార్తీక్ (సీ) డుప్లెసిస్ (బీ) శార్దుల్ ఠాకూర్ 18, అండ్రూ రస్సెల్ (సీ)షోరీ (బీ) తాహీర్ 10, శుభ్‌మన్ గిల్ (సీ) రవీంద్రజడేజా (బీ) శార్దుల్ ఠాకూర్ 15, పీయూష్ చావ్లా (నాటౌట్) 4, కుల్దీప్ యాదవ్ (రనౌట్) ధోనీ/శార్దుల్ ఠాకూర్ 0.
ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 161 (20 ఓవర్లలో 8వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-38, 2-79, 3-80, 4-122, 5-132, 6-150, 7-161, 8-161.
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-36-0, శార్దుల్ ఠాకూర్ 4-0-18-2, మిచెల్ శాంత్నర్ 4-0-30-1, రవీంద్ర జడేజా 4-0-49-0, ఇమ్రాన్ తాహీర్ 4-0-27-4.
చెన్నై ఇన్నింగ్స్: షేన్ వాట్సన్ (ఎల్‌బీ) (బీ) గుమీ 6, ఫాఫ్ డుప్లెసిస్ (బీ) నరైన్ 24, సురేశ్ రైనా (నాటౌట్)58, అంబటి రాయుడు (సీ) ఊతప్ప (బీ) చావ్లా 5, కేదార్ జాదవ్ (ఎల్‌బీ) (బీ) చావ్లా 20, ఎంఎస్ ధోనీ (ఎల్‌బీ) (బీ) నరైన్ 16, రవీంద్ర జడేజా (నాటౌట్) 31.
ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 162 (19.4 ఓవర్లలో 5వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-29, 2-44, 3-61, 4-81, 5-121.
బౌలింగ్: ప్రసిద్ద్ క్రిష్ణ 4-0-30-0, హెన్నీ గుమీ 4-0-37-1, అండ్రూ రస్సెల్ 1-0-16-0, సునీల్ నరైన్ 4-1-19-2, కుల్దీప్ యాదవ్ 3-0-28-0, పీయూష్ చావ్లా 3.4-0-32-2.
చిత్రాలు.. సురేశ్ రైనా (58, నాటౌట్)
*ఇమ్రాన్ తాహీర్ 4-0-27-4