క్రీడాభూమి

ప్రపంచకప్ జట్టును ప్రకటించిన బంగ్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఏప్రిల్ 16: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మే 30 నుంచి ఇంగ్లాండే, వేల్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీకి మంగళవారం 15మందితో కూడిన తమ జట్టును ప్రకటిం చింది. బీపీల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్)లో గాయపడిన ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, గత న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన లిటన్ దాస్‌లకు జట్టులో చోటు దక్కింది.
బీసీబీ ప్రకటించిన జట్టులో తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీం, సౌమ్య సర్కార్, షబ్బీర్ రహమన్, మహమ్మ ద్ మిథున్ స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్లు కాగా, మహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, మొసద్దీక్ హుస్సేన్, షకీబ్ అల్ హసన్ ఆల్‌రౌం డర్లుగా ఉన్నారు. ఇక పేస్ విభాగంలో ముస్తాఫిజుర్ రహమన్, అబూ జాయేద్, రూబెల్ హుస్సేన్, మష్రాఫ్ మొర్తాజాలున్నారు.
జూన్ 2న తొలి మ్యాచ్..
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 2న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్ సన్నాహాక శిబిరం ప్రారంభం కానుంది. దీంతో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఆడుతన్న బంగ్లా క్రికెటర్లు స్వ దేశానికి వెళ్లనున్నారు. అయతే బంగ్లాదేశ్ ప్రపంచకప్‌కు ముందు మే 5 నుంచి 17 వరకు ఐర్లాండ్‌లో జరిగే ట్రై సిరీస్‌లో పాల్గొననుంది. ఈ సిరీస్‌లో మూడో జట్టుగా వెస్టిండీస్ ఆడనుం ది. ప్రపంచకప్ జట్టుతో పాటు ట్రై సిరీస్‌లో పాల్గొనబోయే జట్టును కూడా బీసీబీ ప్రకటించింది.
ప్రపంచకప్ జట్టు: మష్రాఫ్ మొర్తాజా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీం (వికెట్ కీపర్), మహ్మదుల్లా రియాద్, షకీబ్ అల్ హసన్, మహమ్మద్ మిథున్, షబ్బీర్ రహమన్, మొసద్దీక్ హుస్సేన్, మహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహమన్, అబూ జాయేద్.
ఐర్లాండ్‌తో ట్రై సిరీస్ జట్టు: మష్రాఫ్ మొర్తాజా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిటస్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా రియాద్, షకీబ్ అల్ హసన్, మహమ్మద్ మిథున్, షబ్బీర్ రహమన్, మొసద్దీక్ హుస్సేన్, మహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహమన్, అబూ జాయేద్, నయామ్ హసన్, యాసిల్ అలీ.
చిత్రాలు.. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న బంగ్లా సీనియర్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్