క్రీడాభూమి

నా కల సాకరమైంది: కార్తీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 16: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉంది. 2019 ప్రపంచకప్ ఆడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని మాట్లాడిన వీడియో ఒకటి కోల్‌కతా నైట్ రైడర్స్ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. చివరి వరకు దినేష్ స్థానంలో రిషభ్ పంత్‌కు చోటు దక్కుతుందని అనుకున్నారంతా. కానీ సెలక్షన్ కమిటీ మాత్రం బ్యాకప్ వికెట్ కీపర్‌గా సినీయర్ ఆటగాడైనా దినేష్ కార్తీక్ వైపే మొగ్గు చూపింది. దినేష్ కార్తీక్ 2007 ప్రపంచకప్ తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఆడలేదు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కడంపై దినేష్‌తో పాలు అతడి సన్నిహితులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.