క్రీడాభూమి

కూర్పులు, మార్పులు లేకే ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా మంగళవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఆటతీరు సంతృప్తినివ్వలేదని రాజస్తాన్ రాయల్స్ టీమ్ ప్రధాన కోచ్ ప్యాడీ అప్టాన్ అన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల ద్వారా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశాడు. జట్టులో కూర్పులు, మార్పులు లేక ఓటమిని చవిచూస్తున్నామని అన్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన రాజస్తాన్ రాయల్స్ ఆరో ఓటమిని మూటకట్టుకుంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు అట్టడుగు స్థాయిలో ఉంది. ఇప్పటివరకు ఆ డిన 8 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలోనే గెలుపుతో 4 పాయింట్లలో నిలిచింది. ‘ప్రతిసారీ 11 మందితో గెలవడం లేదు. ప్రతిసారీ అందరూ ఫామ్ లో ఉండలేరు. కుదరుకునేందుకు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. చాలారోజులుగా నిలకడగా ఒకే జట్టుతో ఆడుతున్నాం. అయినా రాణించకలేపోతున్నాం. ప్రస్తుతం ఉన్న తమ జట్టులో ఆసక్తిగల, సమర్ధవంతమైన పాత్ర పోషించగల ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వాలి’ అని ప్యాడీ అప్టాన్ నొక్కిచెప్పాడు. పంజాబ్‌తో జరిగిన పోరులో 12 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత ఆయన మీడియాతో కాసేపు మాట్లాడాడు. ‘జట్టులోని ఆటగాళ్లందర్నీ ఒకేరీతిన వినియోగించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో జట్టులో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఆశించవచ్చు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో చిన్న పొరపాట్లతో అంటే ఒకటి లేదా రెండు ఓవర్లలో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో విఫలమవుతున్నాం’ అన్నాడు.