క్రీడాభూమి

టోక్యో ఒలింపిక్స్ పోర్టల్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఓసీ) గురువారం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. 2020లో జరిగే ఈ ఒలింపిక్స్ టికెట్ల అమ్మకాలపై అన్ని వివరాలు ఈ పోర్టల్‌లో లభ్యమవుతాయి. జపాన్ పౌరులకు లాటరీ విధానం ద్వారా టికెట్లను అమ్మనున్నట్టు ఓసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఒలింపిక్స్‌లో, రికార్డు స్థాయిలో 33 క్రీడలకు సంబంధించి 339 ఈవెంట్స్‌లో పోటీలు జరుగుతాయి. అతి తక్కువ టికెట్ ధరను 22 యెన్‌లు (సుమారు 1,526 రూపాయలు)గా నిర్ణయించారు. అత్యధికంగా ఒకొక్కటీ 3,00,000 యెన్‌ల (సుమారు 1,85,915 రూపాయలు) విలువైన టికెట్లను కూడా అమ్మకానికి ఉంచారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత సమీపం నుంచి చూడాలంటే, ఈ భారీ మొత్తాన్ని చెల్లించక తప్పదు. పురుషులకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లు మైదానానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉంటాయి. అక్కడ ఒక్కో సీట్ కోసం 1,30,000 యెన్‌లు (సుమారు 80,568 రూపాయలు) ఖర్చు చేయాల్సిందే. మహిళలు, చిన్న పిల్లలు, సీనియర్ సిటిజెన్స్‌కు టికెట్ల ధరల్లో రాయితీలు ఇస్తున్నారు. అందుబాటులో ఉన్న టికెట్ల కంటే ఎంతో అధికంగా డిమాండ్ ఉండడంతో, వాటిని లాటరీ విధానంలో కేటాయించాలని ఓసీ తీర్మానించింది. వచ్చేనెల 9 నుంచి 28వ తేదీ వరకూ లాటరీ ద్వారా టికెట్ కొనుగోలుదారులను ఎంపిక చేయడానికి గురువారం ప్రారంభించిన పోర్టల్ ఉపయోగపడుతుంది. ఆసక్తిగల వారంతా ఈ పోర్టల్ ద్వారా తమతమ పేర్లను నమోదు చేసుకోవాలని ఓసీ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీయులకు టికెట్ల అమ్మకాలను జూన్ 15వ తేదీ నుంచి మొదలుపెడతామని వివరించింది. విదేశీయులు ఎవరైనా టికెట్ల కోసం వివరాలను http://ticket.tokyo2020.org/?culuture=en-us అనే వెభ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చని ఓసీ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, విదేశీయులకు టికెట్ ధరలను ఇంకా ఖరారు చేయలేదని వివరించింది. వివిధ దేశాల్లోని ఒలింపిక్స్ అభిమానుల కోసం సుమారు 78 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచుతారని సమాచారం. టోక్యో ఒలింపిక్స్ 2020 జూలై 24న మొదలై, ఆగస్టు 9వ తేదీతో ముగుస్తాయి.