క్రీడాభూమి

లెక్క సరిచేసేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 19: సొంత మైదానంలో రాజస్థాన్‌పై ఓడిన ముంబై ఇండియన్స్ శనివారం జరిగే మ్యాచ్‌లో లెక్క సరిచేయనుందా? రెండు వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న ముంబై జట్టును ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ నిలువరించనుం దా? ఇప్పటికే పాయంట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబై రాజస్థాన్‌పై గెలిచి లెక్క సమం చేయాలని చూస్తోంది. ప్రస్తుతం జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ ఫర్వాలేదనిపిస్తుండగా, మరో ఓపెనర్ డీకాక్ మాత్రం మంచి ఫాంలో ఉన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఆశించినమేరకు ఆడలేదు. అయతే ముంబై మిడిలార్డర్ బలంగా ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్‌లో కీరన్ పొలార్డ్ ఆల్‌రౌండర్లు పాండ్య సోదరులు రాణిస్తుండడం జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు బౌలర్లు బుమ్రా, మలింగ, కృనాల్, బెహ్రెన్‌డార్ఫ్, అల్జారీ జోసెఫ్, హార్దిక్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో వీరంతా కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అయతే రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బౌలర్ల ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడం ముంబైకి ప్రతికూల అంశమే. 187 పరుగులు చేసినా రాజస్థాన్ గెలుపును బౌలర్లు ఆపలేకపోయారు. ఈ మ్యాచ్‌లో అల్జారీ జోసెఫ్ 3 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులిచ్చాడు. అయతే గత మ్యాచ్ తప్పిదాలను పునరావృతం కానివ్వకుండా గెలుపుపై ముంబై ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు పాయంట్ల పట్టికలో చివరి వరుస నుంచి రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ సీజన్‌లో పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఆడిన 8 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మినహా మరే మ్యాచ్ గెలవలేదు. జట్టు కెప్టెన్ అంజిక్యా రహానే ఇప్పటివరకు రాణించలేదు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఫాంలో కలిసొచ్చే అంశం. జట్టులో బట్లర్ మినహా మరే ఆటగాడు చెప్పుకోదగిన స్కోర్లు చేయలేదు. నిషేధం తర్వాత ఐపీఎల్ చోటు దక్కించుకున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రదర్శన పేలవంగా ఉంది. గత మ్యాచ్‌లో ముంబైని ఓడించామనే ధీమాతోనే రాజస్థాన్ బరిలోకి దిగుతుండగా, సొంత మైదానంలో ఆడుతుండడం కలిసొచ్చే అంశం.