క్రీడాభూమి

పరాగ్‌కు స్మిత్ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 21: రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను ఆ జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ప్రశంసలతో ముంచెత్తాడు. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో పరాగ్ (43) పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లోనూ రెండు ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి ఫర్వాలేదనిపించాడు. 17 ఏళ్ల పరాగ్ అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపిస్తున్నాడని, లక్ష్య ఛేదనలో ఒత్తిడికి గురికాకుండా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న పరా గ్‌కు బౌలింగ్‌లో మంచి నైపుణ యం ఉందని చెప్పాడు.