క్రీడాభూమి

ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో భారత్, రష్యా ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఒలింపిక్ క్వాలిఫయర్ ఈవెంట్‌గా, భువనేశ్వర్‌లో జూన్ 6 నుంచి 15వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ షెడ్యూల్ ఖరారైంది. గురువారం విడుదల చేసిన వివరాల ప్రకారం భారత్ తన తొలి మ్యాచ్‌లో రష్యాను ఢీ కొంటుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్‌కు 22వ ర్యాంకర్ రష్యాను ఓడించి, టోర్నమెంట్‌లో శుభారంభం చేయడం కష్టం కాదనే చెప్పాలి. మొదటి రోజు భారత్, రష్యా జట్ల మధ్య పోరుతోపాటు, ఇతర మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా/ అమెరికా, పోలాండ్/ ఉజ్బెకిస్తాన్ జట్ల మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో భారత్ పూల్ ‘ఏ’ నుంచి బరిలోకి దిగుతుంది. ఈ పూల్‌లో భారత్‌తోపాటు పోలాండ్ (21వ ర్యాంక్), రష్యా (22వ ర్యాంక్), ఉజ్బెకిస్తాన్ (43వ ర్యాంక్) ఉన్నాయి. పూల్ ‘బీ’ నుంచి దక్షిణాఫ్రికా (16వ ర్యాంక్), ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జపాన్ (18వ ర్యాంక్), అమెరికా (25వ ర్యాంక్), మెక్సికో (39వ ర్యాంక్) జట్లు పోటీపడతాయి. కాగా, భారత్ తొ మ్యాచ్‌ని జూన్ 6న రష్యాతో ఆడుతుంది. ఏడోతేదీన పోలాండ్, 10వ తేదీన ఉజ్బెకిస్తాన్ జట్లను పూల్ మ్యాచ్‌ల్లో ఢీకొంటుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జూన్ 15న కళింగ స్టేడియంలో జరుగుతుంది. ఇలావుంటే, భారత పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన గ్రాహం రీడ్‌కు ఈ టోర్నీ మొదటి అతిపెద్ద సవాలుగా మారనుంది. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాలంటే, ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో నెగ్గడాన్ని తొలి అడుగుగా పేర్కోవాలి. మరోవైపు జూన్ 15 నుంచి 23వ తేదీ వరకూ హిరోషిమాలో జరిగే ఎఫ్‌ఐహెచ్ మహిళల సిరీస్ ఫైనల్స్ ఈవెంట్‌లో భారత్ పూల్ ‘ఏ’ నుంచి పోరాడనుంది. ఈ పూల్‌లో భారత్‌తోపాటు పోలాండ్, ఫిజీ, ఉరుగ్వే జట్లు ఉన్నాయి. అదే విధంగా పూల్ ‘బీ’ నుంచి జపాన్, చిలీ, రష్యా, మెక్సికో జట్లు పోరాడనున్నాయి.