క్రీడాభూమి

ఐపీఎల్‌కు స్టెయిన్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 25: దక్షిణాఫ్రికా సూపర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్ నుంచి దూరమయ్యాడు. కుడి భుజం గాయం కారణంగా స్టెయిన్ స్వదేశానికి వెళ్లనున్నట్టు అతను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్యం ప్రకటించింది. నాథన్ కౌల్టర్ నైల్ గాయపడినందున అతని స్థానంలో స్టెయిన్‌ను తీసుకున్నారు. అయితే, ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన కారణంగా అతను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. వైద్యుల సలహా మేరకు అతను ఐపీఎల్‌లో కొనసాగడం లేదని ఆర్‌సీబీ చైర్మన్ సంజీవ్ చురీవాలా ఒక ప్రకటనలో తెలిపాడు. ఇంతకు ముందు కూడా గాయాల కారణంగానే స్టెయిన్ పలు అంతర్జాతీయ సిరీస్‌లకు దూరమయ్యాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో అతను ఆడలేకపోయాడు. ఇప్పుడు అదృష్టం నైల్ గాయం రూపంలో వరించినప్పటికీ, తాను స్వయంగా గాయపడిన కారణంగా ఆ యవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది.