క్రీడాభూమి

భారత్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కున్షాన్ (చైనా), మే 15: థామస్ కప్ కోసం పురుషుల విభాగంలో జరిగే పోటీల్లో మొదటి రోజు భారత్‌కు చుక్కెదురైంది. థాయిలాండ్‌తో తలపడిన భారత్ 2-3 తేడాతో ఓడింది. సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ విజయాలను నమోదు చేయగా, అజయ్ జయరాం చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన అజయ్ జయరామ్ 16-21, 21-12, 14-21 తేడాతో తనోన్‌సాక్ సయెసమ్‌బూన్సుక్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత సంపాదించిన అనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ డబుల్స్ విభాగంలో బొదిన్ ఇసారా, నిపిఫొన్ పాంగ్‌పుపెచ్ జోడీ చేతిలో 17-21, 6-21 తేడాతో చిత్తయ్యారు. అయితే, రెండో సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 21-11, 21-16 ఆధిక్యంతో కోసిత్ ఫెట్రప్రదబ్‌ను ఓడించాడు. కానీ, రెండో డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్, సాత్విక్ సాయిరాజ్ జోడి 15-21, 21-14, 15-21 తేడాతో పవరెనుక్రొచ్ డెచాపొల్, కెడ్రెన్ కిటినుపాంగ్ జోడీ చేతిలో ఓడింది. చివరి సింగిల్స్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 21-17, 21-16 తేడాతోఅడుల్చ్ నంకుల్‌ను ఓడించి భారత్‌కు కొంత ఊరటనిచ్చాడు.

రోమ్ ఓపెన్ టెన్నిస్
సత్తాచాటిన సాన్‌టినా
రోమ్, మే 15: రోమ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ వి భాగంలో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. సాన్‌టినాగా పేరొందిన ఈ జోడీ ఫైనల్‌లో ఎకతరీన మకరోవా, ఎలెనా వెస్నినా జోడీపై 6-1, 6-7, 10-3 తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో వీరు ఫైనల్ చేరడం ఇది మూడోసారి. అయతే, గత రెండు పర్యాయాలు టైటిల్ సా ధించలేకపోయన వీరు ఈసారి విజేతలుగా నిలిచారు.