క్రీడాభూమి

ప్రపంచకప్‌కు 22మంది అంపైర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఏప్రిల్ 26: ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జరిగే ప్రపంచకప్‌కు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) శుక్రవారం అంపైర్ల ను నియమించింది. 48 మ్యాచ్‌ల ఈ మెగా టోర్నీలో 16 మంది అంపై ర్లుగా, ఆరుగురు మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. అంపైర్ ఇయాన్ గౌల్డ్ 2019 ప్రపంచకప్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పను న్నారు. 1983లో ఇంగ్లాండ్ జట్టులో వికెట్ కీపర్‌గా వ్యవహరించిన ఆయ న తన కెరీర్‌లో 74 టెస్టులు, 135 వనే్డలు, 37 టీ20లకు అంపైర్‌గా వ్యవహరించారు.
మ్యాచ్ రిఫరీలు: క్రిస్ బోర్డ్, డేవిడ్ బూన్, ఆండి పైక్రా ఫ్ట్, జెఫ్ క్రోవ్, రంజన్ మాడుగల్లే, రిచీ రిచర్డ్‌సన్.
అంపైర్లు: అలీందర్, కుమార ధర్మసేన, మారైస్ ఎర్మాస్, క్రిస్ గాఫెన్ని, ఇయాన్ గౌల్డ్, రిచర్డ్ ఇల్లింగ్‌వార్త్, రిచర్డ్ కెట్టిల్‌బోరో, నిగెల్ లాంగ్, బ్రూస్ అక్సెన్‌ఫొర్డ్, సుందరం రవి, పాల్ రైఫెల్, రాడ్ టక్కర్, జొయెల్ విల్సన్, మైఖెల్ డో, రిచిరా పిల్లాయాగెర్లే, పాల్ విల్సన్.