క్రీడాభూమి

బీబీఎల్‌కు వాట్సన్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఏప్రిల్ 26: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్ర వారం ప్రకటించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ కొన్ని లీగ్‌లలో మాత్రం కొనసా గుతున్నాడు. తాజాగా కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయతే కొన్ని లీగ్‌లలో మాత్రం కొనసాగుతా నని స్పష్టం చేశాడు. బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వాట్సన్ భావోద్వేగంతో మాట్లాడాడు. మీతో ఎన్నో మధురానుభూతులు పంచుకున్నాను. బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఎంతోమంది గొప్ప క్రికెటర్లతో అనుబం ధం పెం చుకున్నాను. రానున్న సీజన్లలో అందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నా. అని తెలిపాడు. గత సీజన్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్ 62 బంతులలో సెంచరీ సాధించాడు. 2018-19 సీజన్‌లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. జట్టులో 1024 పరు గులు చేసిన ఏకైక క్రికెటర్ వాట్సన్. ఆ జట్టు కోచ్ షేన్ బాండ్ వాట్సన్‌ను ‘ది అల్టిమేట్ ప్రొఫెనషనల్’ అని పి లుస్తుంటాడు. బిగ్ బాష్ లీగ్ రిటర్మైంట్‌తో వాట్సన్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు పూర్తిగా దూరమైన ట్లే. ప్రస్తుతం వాట్సన్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 96 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బీబీ ఎల్ కెరీర్‌లో అద్భుతంగా రాణించి, రిటైర్మెంట్ ప్రకటిం చిన వాట్సన్‌కు ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కెవిన్ రాబర్ట్స్ శుభాకాం క్షలు తెలిపాడు.