క్రీడాభూమి

అమిత్ ఖాతాలో మరో గోల్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, ఏప్రిల్ 26: ఇక్కడ జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 13 పతకాలు సాధించించింది. ఇందులో ఐదు గోల్డ్, నాలుగు రజతం, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేరు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న అమిత్ పంగల్ (52 కేజీలు) ఈ ఏడాది రెండోసారి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. మహిళల విభాగంలో పాల్గొన్న పూజా రాణి (81 కేజీలు) మహిళల విభాగంలో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అమిత్ పంగల్ గత ఏడాది జరిగిన ఆసియా గేమ్స్ కొరియా బాక్సర్ కిమ్ ఇంక్యూను ఓడించి గోల్డ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో బల్గేరియాలో జరిగిన సట్రెంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో మరో గోల్డ్ మెడల్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఆసియా చాంపియన్‌షిప్‌లో గెలిచిన గోల్డ్‌మెడల్‌తో తాను ఎంతో సంతృప్తి చెందుతున్నానని, ఇది తన ఖాతాలో మరో బోనస్ వంటిదని ఆయన పేర్కొన్నాడు. 2015లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పంగల్ రజత పతకం అందుకున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో గెలుపుతో ఈ ఏడాది జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అమిత్ పంగల్‌కు బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. ఇదిలావుండగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో అమిత్ పంగల్ సాధించిన అద్భుత ప్రగతితో తాను ఎంతో గర్విస్తున్నానని ఇండియన్ బాక్సింగ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నీవా అన్నాడు. ఇదిలావుండగా, 28 ఏళ్ల పూజా రాణి 2012లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం అందుకుంది. ఇపుడు చైనా బాక్సర్ వాంగ్ లినాను ఓడించి ఏకంగా గోల్డ్‌మెడల్‌ను కైవశం చేసుకుంది. 2014 ఆసియా గేమ్స్‌లో సైతం ఆమె రజత పతకం అందుకుంది. కాగా, జాతీయ చాంపియన్ దీపక్ సింగ్ (49 కేజీలు), కవీందర్ సింగ్ బిస్త్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు) పురుషుల విభాగంలో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మహిళల విభాగంలో సిమ్రాన్‌జిత్ కౌర్ (64 కేజీలు) సైతం కాంస్య పతకం గెల్చుకుంది. శిత థాప (60 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీష్ కుమార్ (+91 కేజీలు) పురుషుల విభాగంలో రజత పతకాలు సాధించారు. 2009లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భారత్ ఒక గోల్డ్, రెండు కాంస్య పతకాలు, నాలుగు రజత పతకాలు సాధించింది.