క్రీడాభూమి

ముంబయ ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 15: డిఫెండింగ్ చాంపియన్ గా ఐపిఎల్‌లో బరిలోకి దిగిన ముంబయ ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయ. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవి ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 80 పరుగుల భారీ తే డాతో విజయభేరి మోగించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయ 20 ఓవర్లలో నా లుగు వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. కృణాల్ పాండ్య 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల తో 86 పరుగులు సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (31), మార్టిన్ గుప్టిల్ (48) ఈ స్కోరుకు తమ వంత సాయం అందించారు. చివరిలో జోస్ బట్లర్ (9 బంతుల్లో 18), అం బటి రాయుడు (5 బంతుల్లో 13 పరుగులు) నాటౌట్‌గా నిలిచారు. కాగా, 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడా నికి మైదానంలోకి దిగిన డేర్‌డెవిల్స్ 19.1 ఓవర్లలో 126 ప రులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, రిషభ్ పంత్ (23), క్రిస్ మోరిస్ (20) కొంతసేపు ముంబయ బౌలర్లకు ఎదురునిలిచే ప్రయత్నం చేశారు. మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూకట్టడంతో డేర్‌డెవిల్స్ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే 126 పరుగులకు ఆలౌటైంది. ముంబయ బౌలర్ జస్‌ప్రీత్ బు మ్రా నాలుగు ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి మూడు వి కెట్లు పడగొట్టాడు.