క్రీడాభూమి

శెభాష్ చండీలా, అంజుమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎయర్ రైఫిల్ 10 మీటర్ల మహిళల విభాగంలో భారత షూటర్లు స్టార్ అపూర్వి చండీలా, అంజుమ్ వౌద్గిల్ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. కొన్నా ళ్లుగా నిలకడ ఆట తీరు ప్రదర్శిస్తున్న వీరిద్దరూ బుధవారం ఈ ఘనతను అందుకు న్నారు. ఈ సందర్భంగా చండీలా ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుంది. నా షూటింగ్ కేరీర్‌లో 10 మీటర్ల ఎయర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ మైలురాయ చేరుకున్నాను అని ట్వీట్ చేసింది. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఐదుగు రు భారత షూటర్లలో చండీలా కూడా స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఫిబ్ర వరిలో జరిగిన ఇంటర్నేషన్ షూటింగ్ స్పో ర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో రికార్డు స్థాయ పాయంట్లను సాధించి బంగారు పతకాన్ని సాధించగా, 2014లో జరిగిన గ్లాస్గో కామనె్వల్త్ పోటీల్లో స్వర్ణం, గోల్డ్‌కోస్ట్ కామనె్వల్త్ పోటీల్లో కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. తాజాగా బీజింగ్‌లో జరి గిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ పోటీల్లో 207.8 పాయంట్లు సాధించి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే ప్రపంచకప్‌లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో వౌద్గిల్ 10 మీటర్ల ఎయర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది.

చిత్రాలు.. అంజుమ్ వౌద్గిల్ *అపూర్వి చండీలా