క్రీడాభూమి

గెలిస్తేనే ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మే 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నాకౌట్‌కు చేరే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ శుక్రవారం కీలక మ్యాచ్‌లో ఢీ కొనేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు జట్లకూ విజయం అత్యవసరం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే, ఆశలు సజీవంగా ఉంటాయి. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ని సొంతం చేసుకునేందుకు అటు దినేష్ కార్తీక్ నాయకత్వంలోని కోల్‌కతా, ఇటు రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న పంజాబ్ సర్వశక్తులు ధారపోయడం ఖాయం. టోర్నమెంట్‌లో పోటీపడుతున్న ఎనిమిది జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిట్టచివరి స్థానంలో ఉండగా, కోల్‌కతా ఆరు, పంజాబ్ ఏడు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లు ఇప్పటి వరకూ చెరి 12 మ్యాచ్‌లు ఆడాయి. ఐదేసి విజయాలు నమోదు చేశాయి. చెరి ఏడు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొన్నాయి. మొత్తం పది పాయింట్లు సంపాదించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇతర జట్లు కొనసాగిస్తున్న జోరును చూస్తుంటే, కోల్‌కతా, పంజాబ్‌లో ఏ జట్టుకూ ప్లే ఆఫ్ చేరుకునే అవకాశం లేదని స్పష్టమవుతుంది. అయితే, సాంకేతికంగా ఈ రెండు జట్లకూ, ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆశలు కొంత వరకైనా సజీవంగా నిలుస్తాయి. ఓడిన జట్టు ఇంటి దారి పట్టడం ఖాయమవుతుంది.