క్రీడాభూమి

న్యూజిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, మే 2: స్టార్ ఆటగాడు టామీ సుగియార్తోకు హెచ్‌ఎస్ ప్రణయ్ షాకిచ్చాడు. ఇక్కడ జరుగుతున్న న్యూజిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ రెండో రౌండ్‌లో అతను సుగియార్తోను 21-14, 21-12 తేడాతో ఓడించి సంచలనం సృష్టించి, క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకూ ప్రణయ్ అసాధారణ ప్రతిభను కనబరచగా, అతనిని తక్కువ అంచనా వేసిన సుగియార్తో భారీ మూల్యానే్న చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా, సెమీస్‌లో స్థానం కోసం కాన్టో సునెయామాను ఢీ కొంటాడు. మరో రెండోరౌండ్ మ్యాచ్‌లో సునెయామా 21-14, 25-23 స్కోరుతో సీ షి కామ్ తమసిన్‌పై విజయం సాధించి, క్వార్టర్స్ చేరాడు. ఇలావుంటే, మరో భారత ఆటగాడు సాయి ప్రణీత్ రెండో రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కొని, టోర్నీ నుంచి నిష్క్రమించాడు. లిన్ డాన్ అతనిని 21-12, 21-12 తేడాతో ఓడించాడు. లిన్ డాన్ తన తర్వాతి మ్యాచ్‌ని ఆంథోనీ సినిసుకా జింటింగ్‌తో ఆడతాడు. జింటింగ్ 21-6, 21-5 స్కోరుతో చాంగ్ వెయ్ ఫెంగ్‌ను చిత్తుచేశాడు. మూడో క్వార్టర్స్‌లో లీ జీ జియా, ఆగ్నస్ ఇంగ్ కా లాంగ్ తలపడతారు. జీ జియా 23-21, 21-16 ఆధిక్యంతో కజుమసా సకాయ్‌పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో ఆగ్నస్ ఇంగ్ కా లాంగ్ 21-16, 21-9 తేడాతో లీ హ్యునిల్‌ను ఓడించాడు. చివరి క్వార్టర్ ఫైనల్స్ సన్ ఫీజింగ్, జొనథాన్ క్రిస్టీ మధ్య ఉంటుంది. ఫీజింగ్ 23-23, 21-16, 21-11 ఆధిక్యంతో హియో క్వాంగ్ హీని ఓడించాడు. జొనథాన్ క్రిస్టీ 21-14, 14-21, 21-16 ఆధిక్యంతో వాంగ్ జూ వెయ్‌పై గెలిచి క్వార్టర్స్ చేరాడు.