క్రీడాభూమి

ధోనీ పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీ ముంబయి, మే 2: ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఎంత వరకూ ముందంజ వేస్తుందనేది విషయంలో వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గురువారం అతను పీటీఐతో మాట్లాడుతూ ఐపీఎల్‌లో ధోనీ అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడని, ఇదే జోరును వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తాడన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు. చెన్నై తరఫున అతను ఇప్పటి వరకూ ఈ ఐపీఎల్ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 358 పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్‌గానూ గొప్పగా రాణిస్తున్నాడు. ఈ అంశాలను గవాస్కర్ ప్రస్తావిస్తూ, ధోనీకి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉందని, పైగా అతను చక్కటి ఫామ్‌లో ఉన్నాడని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో ఒకవేళ ఏ మ్యాచ్‌లోనైనా టాప్ ఆర్డర్‌లో ముగ్గురు ఆటగాళ్లు విఫలమైతే, ఆ నష్టాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ధోనీకి ఉందని గవాస్కర్ ప్రశంసించాడు. వికెట్‌కీపర్‌గా అతని సత్తా ఏమిటో అందరికీ తెలుసునని, ఐపీఎల్‌లో ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, వరల్డ్ కప్‌లో భారత్‌కు విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అన్నాడు.