క్రీడాభూమి

ఎలాంటి టెన్షన్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్‌బేన్, మే 3: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మళ్లీ తమ జట్టులోకి పునరాగమనం చేయడంతో ఇపుడు ‘ఎలాంటి టెన్షన్ లేదు’ అని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. కీలక స్టార్ ఆటగాళ్లు ఇద్దరూ మళ్లీ జాతీయ జట్టులోకి రావడంతో ఈ నెలలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఒక టెస్టులో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న నేరారోపణపై ఏడాదిపాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడకుండా నిషేధాన్ని ఎదుర్కొన్నారు. ఈ నిషేధం పూర్తికావడంతో ఇటీవల కాలం వరకు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. అయితే, ఈనెలలో ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ నేపథ్యంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌కు సన్నద్ధత కోసం స్వదేశానికి రమ్మనమని పిలుపురావడంతో ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంచైజీలను మధ్యలోనే వీడాల్సి వచ్చింది. ఇపుడు ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి రావడంతో ఇపుడు ఎలాంటి టెన్షన్ లేదని కోచ్ జస్టిన్ లాంగర్ హర్షం వ్యక్తం చేశాడు. ‘వాళ్లు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చారు. ప్రపంచ కప్ తుదిజట్టులో వారిద్దరూ ఉన్నారు. వారిరాక ఎంతో ఆనందకరం’ అని జస్టిన్ లాంగర్ మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. ఇదిలావుండగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన డేవిడ్ వార్నర్ ఆడిన 12 ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 692 పరుగులు సాధించిన విషయాన్ని కోచ్ గుర్తు చేశాడు. ప్రపంచ కప్‌కు ఎంపికైన తుది జట్టులో పలువురు అపార అనుభవం కలిగిన సీనియర్ ఆటగాళ్లు ఉండడం వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సీనియర్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తోపాటు ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖాజా, షాన్ మార్ష్ వంటివారితో జట్టు మరింత బలంగా తయారు కానుందని అన్నాడు. దేశం గర్వించేవిధంగా మరోసారి వరల్డ్ కప్‌ను సాధించేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటామన్నాడు.