క్రీడాభూమి

రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా మళ్లీ రహానే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: అజింక్య రహానే మళ్లీ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇప్పటివరకు ఈ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్ ప్రపంచ కప్‌లో సన్నద్ధత కోసం స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానే మళ్లీ మరోసారి జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా రహానే సారథ్యం వహించనున్నాడు. ఇదిలావుండగా, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి జరిగిన తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఆరింట్లో జట్టు పరాజయంపాలు కావడంతో అప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను యాజమాన్యం తొలగించి, ఆసిస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు బాధ్యతలు అప్పజెప్పింది. స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో విజయం సాధించింది. ఇపుడు ప్లే ఆఫ్‌పై నమ్మకంతో ఉంది.