క్రీడాభూమి

రబదాకు గాయం పెద్ద లోటు ట్రెంట్ బౌల్ట్‌పైనే గంపెడాశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబదా గాయం తమ జట్టుకు అతి పెద్ద లోటని ఢిల్లీ కేపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ కేపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబదా ఇంతవరకు ఆడిన 12 గేమ్స్‌లో 25 వికెట్లు సాధించడం ద్వారా పర్పుల్ క్యాప్‌కు అర్హత సాధించాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. అయితే, శనివారం ఢిల్లీ కేపిటల్స్ లీగ్‌లో ఆఖరి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో తమ జట్టులోని ఫాస్ట్ బౌలర్ రబదా గాయపడడం, అదే సమయంలో రానున్న వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు వీలుగా సన్నద్ధత కోసం, గాయం నుంచి రికవరీ పొందేందుకు స్వదేశం నుంచి పిలుపురావడం తమకు పెద్ద లోటని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ‘రబదా జట్టులో లేకపోవడం మా చేతుల్లో ఏమీ లేదు. ఇది పూర్తిగా దక్షిణాఫ్రికా క్రికెట్ తీసుకున్న నిర్ణయమే. గత కొన్ని మ్యాచుల్లో రబదా అద్భుతంగా రాణించాడు. వరల్డ్ కప్‌కు సన్నద్ధత కోసమే అతనికి స్వదేశానికి రమ్మనమని పిలిచారు’ అని పాంటింగ్ శుక్రవారంనాడు ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నాడు. రబదా స్థానాన్ని ఇపుడు తమ జట్టులోని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తీర్చగలడనే నమ్మకం తమకు ఉందని, బౌల్ట్ ప్రపంచశ్రేణి అనుభవం రానున్న ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో తమకు బాగా ఉపకరిస్తుందనే బలంగా విశ్వసిస్తున్నామని ధీమా వ్యక్తం చేశాడు.