క్రీడాభూమి

న్యూజిలాండ్ ఓపెన్ నిరాశపరిచిన ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, మే 3: న్యూజిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ల కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలోని క్వార్టర్ ఫైనల్స్‌లో పోటీపడిన భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఐదో సీడ్, జపాన్‌కు చెందిన కంటా సునేయామా చేతిలో పరాజయం పాలయ్యాడు. మూడు మ్యాచ్‌ల పోరులో తొలి సెట్‌లో ప్రణయ్ 21-17తో ప్రత్యర్థిపై విజయం సాధించినా, మిగిలిన రెండు సెట్లలో 15-21, 14-21 తేడాతో ఓటమిని చవిచూశాడు. దీనితో, ఈ టోర్నీలో పో టీపడిన భారతీయుల పోరాటాలకు తెరపడింది.