క్రీడాభూమి

ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, మే 15: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ ప్లే ఆఫ్‌లో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్ధ శతకం, చివరిలో యువరాజ్ సింగ్ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం సన్‌రైజర్స్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున షహీం ఆమ్లా చేసిన పోరాటం వృథాకాగా, ఆ జట్టు ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది. పంజాబ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా, మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు సాధించింది. ఆమ్లా 56 బంతుల్లో 96 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అతని స్కోరులో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ మురళీ విజయ్ కేవలం ఆరు పరుగులు చేసి, ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. 33 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా, గుర్‌కీతర్ సింగ్ చెరి 27 పరుగులు చేసి అవుటయ్యారు. సాహాను దీపక్ హూడా క్యాచ్ పట్టగా మోజెస్ హెన్రిక్స్ పెవిలియన్‌కు పంపాడు. గుర్‌కీరత్‌ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించేందుకు చెమటోడ్చిన ఆమ్లా చివరి ఓవర్ నాలుగో బంతిలో అవుటయ్యాడు. పంజాబ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసే సమయానికి డేవిడ్ మిల్లర్ (20), గ్లేన్ మాక్స్‌వెల్ (0) నాటౌట్‌గా ఉన్నారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ 32 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ముస్త్ఫాజుర్ రెహ్మాన్, మోజెస్ హెన్రిక్స్ చెరొక వికెట్ కూల్చారు.
నాకౌట్‌లో స్థానాన్ని సంపాదించే అవకాశాలను మరింత మెరుగు పరచుకోవడానికి 180 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ మరోసారి చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 68 పరుగులు జత కలిసిన తర్వాత శిఖర్ ధావన్ రనౌటయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న అతను నాలుగు ఫోర్లతో 25 పరుగులు చేశాడు. వార్నర్ 41 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు సాధించి, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా అవుట్‌కాగా, దీపక్ హూడా 22 బంతుల్లో 34 పరుగులు చేసి, సందీప్ శర్మ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కు చిక్కాడు. అనంతరం యువరాజ్, కట్టింగ్ బెన్ కట్టింగ్ మరో వికెట్ కూలకుండా జట్టుకు విజయాన్ని అందించారు. చివరి ఓవర్‌లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరంకాగా, మోహిత్ శర్మ మొదటి బంతిని వైడ్‌గా వేశాడు. దీనితో అధికారికంగా మళ్లీ మొదటి బంతే వేయాల్సిరాగా, యువీ దానిని సిక్సర్‌గా మార్చాడు. రెండో బంతిలో ఒక్క పరుగు కూడా లభించలేదు. మూడో బంతిలో యువీ ఒక పరుగు సంపాదించగా, స్కోరు సమమైంది. నాలుగో బంతిలో కట్టింగ్ సింగిల్ తీయడంతో సన్‌రైజర్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. యువీ 24 బంతుల్లో 42 (మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), కట్టింగ్ 11 బంతుల్లో 18 (ఒక ఫోర్, రెండు సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచారు. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్టు ప్లే ఆఫ్ చేరడం ఖాయమైంది. 96 పరుగులు చేసిన ఆమ్లా శ్రమ వృథా అయినప్పటికీ, అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మళ్లీ తనదైన శైలిలో రాణించిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్
సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 (హషీం ఆమ్లా 96, వృద్ధిమాన్ సాహా 27, గుర్‌కీరత్ సింగ్ 27, డేవిడ్ మిల్లర్ 20 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 2/32).
సన్‌రైజర్స్ హైదరాబాద్: 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 180 (డేవిడ్ వార్నర్ 52, శిఖర్ ధావన్ 25, దీపక్ హూడా 34, యువరాజ్ సింగ్ 42 నాటౌట్, బెన్ కట్టింగ్ 18 నాటౌట్).